Today Horoscope Rasi Phalalu December 23, 2021 on thursday know the condition of those zodiac signs : రాశిఫలాలు డిసెంబర్ 23, 2021:
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 19
పుర్నిమంతా - 2078, పుష్యము 4
అమాంత - 2078, మార్గశిరము 19
తిథి
బహుళపక్షం చవితి - Dec 22 04:52 PM – Dec 23 06:27 PM
బహుళపక్షం పంచమి - Dec 23 06:27 PM – Dec 24 07:34 PM
నక్షత్రం
ఆశ్లేష - Dec 23 12:45 AM – Dec 24 02:41 AM
మఖ - Dec 24 02:41 AM – Dec 25 04:09 AM
సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - 6:46 AM
సూర్యాస్తమానము - 5:43 PM
చంద్రోదయం - Dec 23 9:23 PM
చంద్రాస్తమయం - Dec 24 10:35 AM
అనుకూలమైన సమయం
రాహు - 1:37 PM – 2:59 PM
యమగండం - 6:46 AM – 8:08 AM
దుర్ముహూర్తం - 10:25 AM – 11:09 AM, 02:48 PM – 03:32 PM
వర్జ్యం - 03:25 PM – 05:07 PM
శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - 11:53 AM – 12:37 PM
అమృతకాలము - 12:57 AM – 02:41 AM
బ్రహ్మ ముహూర్తం - 05:10 AM – 05:58 AM. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషం: (Aries)
గురువారం మీ కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది. అందరితో సామరస్యం పెరుగుతుంది. మీ వృత్తి జీవితంలో ప్రతి విషయంలోనూ స్పష్టమైన వైఖరితో ఉండండి. వ్యాపార విషయాల్లో కూడా అంతా మంచే జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు లభిస్తాయి.
వృషభం : (Taurus)
ఈ గురువారం రోజు అందరితో మర్యాదగా మాట్లాడాలి. కొన్ని కొత్త అవకాశాలు మీ తలుపుతడుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశాలు లభిస్తాయి. డబ్బు లావాదేవీల్లో అంతా మీరనుకున్నట్లే జరుగుతుంది.
మిథునం : (Gemini)
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి వారు తలపెట్టిన పనిలో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొన్ని కొత్త పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. జాగ్రత్తగా వ్యవహరించండి.
కర్కాటకం: (Cancer)
ఈ రోజు మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులలో ఎవరితోనైనా కలిసి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటే... ఇవ్వాలే మొదలుపెట్టడం మంచిది. ఘర్షణలకు దిగకండి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
సింహం : (Leo)
ఈ గురువారం మీరు అందరి మాటలు వినేందుకు ప్రయత్నిస్తారు. ధైర్యంతో కొత్త సవాళ్లను ఎదుర్కోండి. భూమి, ఆస్తి సంబంధిత పనులు పూర్తి చేస్తారు. మహిళలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ఇదే మంచి రోజు.
కన్య: (Virgo)
గురువారం సాయంత్రంలోగా మీరు శుభవార్తలు వింటారు. మీ పనులన్నీ పూర్తవుతాయి. అనుకున్న సమయంలోనే పనులు పూర్తి అవుతాయి. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.
Also Read : trigraha yoga: కొత్త సంవత్సరంలో మకర రాశిలోకి మూడు గ్రహాలు...ఆ రాశుల వారికి చాలా ఇబ్బందులు
తుల : (Libra)
గురువారం మీరు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని ప్రయత్నాలు మొదలుపెట్టండి. కొన్ని వ్యాపార విషయాల్లో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
వృశ్చికం: (Scorpio)
గురువారం మీరు ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఈ రోజు తిరిగి పొందుతారు. మీ కొత్త ఉద్యోగంలో మంచి ఫలితాలు చూస్తారు.
ధనుస్సు : (Sagittarius)
ఈ రోజు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. డబ్బు పరంగా కొన్ని ఆఫర్లు వస్తాయి. కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలను ఇతరులతో చెప్పడం మంచింది.
మకరం: (Capricorn)
మకరరాశి మహిళలకు ఈ గురువారం అంతా మంచే జరుగుతోంది. కొన్ని పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా ఆగిపోయిన పనుల్లో మళ్లీ వేగం పుంజుకుంటుంది. విద్యార్థులకు చదువు విషయంలో ఆసక్తి ఏర్పడుతుంది.
కుంభం: (Aquarius)
ఈ గురువారం మీకు ప్రశంసలు వెల్లువెత్తుతాయి. ముఖ్యమైన పనులు ఏవైనా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంటే.. వాటిని ఈ రోజు పూర్తి చేయండి. ఇవాళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మంచిది. యువతకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు తగ్గుతాయి.
మీనం : (Pisces)
ఈ గురువారం రోజు మీరు అందరితో మర్యాదగా మాట్లాడాలి. మీకు ఈ రోజు కొన్ని కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. డబ్బు లావాదేవీల్లో మీకు అంతా మంచే జరుగుతుంది. మీ శ్రమను గుర్తించి.. ఉద్యోగంలో పదోన్నతి, ఉన్నత స్థానం పొందే సూచనలు ఉన్నాయి.
Also Read : పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook