Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్‌.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..

Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారు తిరుమలకు నడక లేదా ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఈ టోకెన్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లు తిరుమల దేవస్థానం జారీ చేస్తుంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులను కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
 

1 /5

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశుని దర్శనం చేసుకోవడానికి నిత్యం వేలమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారు నడక మార్గం, సర్వదర్శనం లేదా ప్రత్యేక దర్శనం టోకెన్ల ద్వారా స్వామివారి దర్శనం ఉంచుకుంటారు.  

2 /5

అయితే శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  

3 /5

నిన్న శ్రీవారి దర్శనానికి 65,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అందులో 19 వేలకు మందికి పైగా తలనీలాలు శ్రీవారికి సమర్పించుకున్నారు. ఇది కాకుండా హుండీ ఆదాయం నిన్న నాలుగు కోట్లకు పైగా వచ్చింది.  

4 /5

తిరుమల వచ్చే ఎన్నారై భక్తులను కొంతమంది ఘరానా మోసగాళ్లు టీటీడీ పీఆర్‌ఓ అని మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.  

5 /5

భక్తులు కూడా కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే తిరుమల టోకెన్లు పొందాలని.. ఫేక్ వెబ్సైట్లు ఉన్నాయి, వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిన్న మే నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా జారీ చేశారు. గదుల కోటా కూడా విడుదల చేశారు.