షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం నటించిన వివాదాస్పద పఠాన్ సినిమా ఇవాళ అంటే జనవరి 25వ తేదీ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే సినిమా హెచ్‌డి క్వాలిటీలో లీక్ అవడం షాక్ కల్గిస్తోంది.
పఠాన్ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో చాలా రికార్డులు బద్దలు గొట్టేసింది. అటు బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే అంచనాలున్నాయి. సినిమా విడుదలైంది. ఫ్యాన్స్ రియాక్షన్ తెలియడానికి ముందే ఈ సినిమా ఓ వెబ్‌సైట్‌లో లీకైంది. అది కూడా హెచ్‌డి క్వాలిటీలో కావడం విశేషం. ఏయే ఆన్‌లైన్ వేదికల్లో సినిమా లీకైందో తెలుసుకుందాం..
పఠాన్ సినిమా సిబ్బంది, చిత్ర నిర్మాతలు ఇప్పటికే యాంటీ పైరసీ గురించి మాట్లాడారు. సినిమాను కేవలం థియేటర్లలోనే చూడమని విజ్ఞప్తి చేశారు. పైరసీపై ఎన్ని చర్యలు తీసుకున్నా సినిమా లీకైంది. అద్భుతమైన అడ్వాన్స్ కలెక్షన్లు సాధించినా..పైరసీ బారి నుంచి తప్పించుకోలేకపోయింది. అక్రమమార్గంలో లీక్ చేశారు పైరసీకారులు.
టైమ్స్ నౌ అందించిన రిపోర్ట్ ప్రకారం అక్రమంగా ఈ సినిమా Filmyzilla, Filmy4Wapలలో విడుదలైంది. ఒక సైట్‌లో సినిమా వెర్షన్‌ను క్యామ్‌రిప్‌గా మరో సైట్‌లో ప్రీ డీవీడి రిప్‌గా పేర్కొన్నారు. అయితే ఈ రెండు సైట్లలో విడుదలైన పఠాన్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో ఇంకా తెలియలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook