ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు.
న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. ప్రపంచంలో ఆర్ధికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ జీ20 దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకూ ఇండియా నేతృత్వం వహించనుంది. అందుకే దేశవ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నాయి.
ఈ సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్ 5వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 5-7 గంటల మధ్య రాష్ట్రపతి భవన్‌లో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.55 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలు దేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Also read: ED Notices: చంద్రబాబు హయాంలో భారీ కుంభకోణం, 26 మందికి ఈడీ నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook