Nithya Menen Pregnancy : ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన నిత్యా మీనన్.. ఏంటి? పెళ్లయిందా? అంటూ నెటిజన్లు షాక్

Nithya Menen Pregnancy Test నిత్యా మీనన్ తాజాగా చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యంలోని నెట్టేసింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినట్టుగా టెస్ట్ చేసుకున్నట్టుగా చెప్పేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 02:29 PM IST
  • నెట్టింట్లో గందరగోళం క్రియేట్ చేసిన నిత్యా మీనన్
  • ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని చెప్పిన హీరోయిన్
  • షాక్‌లో నిత్యా మీనన్ అభిమానులు
Nithya Menen Pregnancy : ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన నిత్యా మీనన్.. ఏంటి? పెళ్లయిందా? అంటూ నెటిజన్లు షాక్

Nithya Menen Pregnancy : నిత్యా మీనన్ ప్రస్తుతం అందరినీ కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది. నిత్యా మీనన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా ఓ పోస్ట్ వేసింది. అందులో తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టుగా, పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించింది. అంతే కాకుండా పసిపాప కోసం ఓ పాల పీక కూడా చూపెట్టేసింది. అయితే దీన్ని చూసిన నిత్యా మీనన్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదేంటి? నిత్యా మీనన్‌కు పెళ్లి ఎప్పుడు అయింది? ఇదంతా ఎప్పుడు జరిగిందంటూ నెటిజన్లు కంగారు పడుతున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అయితే నిత్యా మీనన్ ఇలా చేయడానికి ఓ కారణం ఉందట. తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలా చేసి ఉంటుందట. అందుకే నిత్యా మీనన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా ప్రకటించి.. తన నెక్ట్స్ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తోందని అంటున్నారు. మరి ఇది నిజంగానే సినిమా ప్రమోషనల్ స్టంటా? లేదంటే నిజంగానే ఏమైనా ఉందా? అనేది తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithya Menen (@nithyamenen)

నిత్యా మీనన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఓటీటీలోనూ, సిల్వర్ స్క్రీన్ మీదా అన్నింట్లోనూ నిత్యా మీనన్ సందడి చేస్తోంది. మోడ్రన్ లవ్, 19 1 a అనే సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య తమిళం, తెలుగులోనూ ధనుష్ నటించిన తిరు సినిమాలో నిత్యా మీనన్ అందరినీ మెప్పించింది. 

ఇక నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్లతోనూ నిత్యా మీనన్ వార్తల్లో నిలిచింది. మహానటి సినిమాలో ముందుగా కీర్తి సురేష్ పాత్ర నిత్యా మీనన్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాగుడు సీన్లుంటే మాత్రం తాను చేయనని నిత్యా మీనన్ అనడం, ఆ మాట అశ్వనీదత్‌కు తెలియడంతో.. ఆమెకు మాత్రం ఆ పాత్రను ఇవ్వకండని అన్నాడట. అలా నిత్యా మీనన్ మహానటి ఆఫర్‌ను చేజిక్కించుకున్నట్టు అయింది.

Also Read : Controversial Comments: బీజేపీ మహిళా నేతలు ఐటెమ్స్... ఖుష్బూ పెద్ద ఐటెం.. అధికార పార్టీ నేత దారుణ వ్యాఖ్యలు!

Also Read :Kantara Domination: దీపావళి నాలుగు సినిమాలను లేపి అవతలేసిన కాంతార.. ఇదెక్కడి మాస్ ర్యాంపేజ్ మావా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News