Submarine missing: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర అంతర్భాగంలో ఉండే సబ్‌మెరైన్ అందులోనే గల్లంతైంది. 53 సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. సబ్‌మెరైన్ కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇండోనేషియా( Indonesia ) సముద్ర జలాల్లో ఓ సబ్‌మెరైన్ గల్లైంతైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 53 మంది సిబ్బందితో కూడిన సబ్‌మెరైన్ గల్లంతవడంతో సిబ్బంది ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా కేఆర్ఐ నంగాల 402 సబ్‌మెరైన్ (Submarine) గల్లంతైందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక దాని నుంచి సిగ్నల్స్ సరిగా రాలేదు. ఎంత సేపటికీ ఆ సబ్‌మెరైన్ నుంచి ఎటువంటి సమాచరం రాకపోవడం, సిగ్నల్స్ మొత్తంగా బ్లాక్ కావడంతో మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. మెరైన్ను కనుగొనేందుకు సింగపూర్(Singapore), ఆస్ట్రేలియా(Australia)ల సాయం కోరారు.
హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ సైతం నీటి మీద తిరుగుతూ మెరైన్ జాడను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆచూకీ తెలియడం లేదు. ఇండోనేషియా మీడియా చూపిస్తున్న వివరాల ప్రకారం సముద్ర మట్టం నుంచి 2 వేల 300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. సబ్‌మెరైన్ (Submarine) ప్రారంభమైన చోట ఆయిల్ లీకైన జాడలను ఓ హెలికాప్టర్ గుర్తించిందని అందులో పేర్కొన్నారు. బహుశా ఈ ప్రమాదానికి కారణం ఆయిల్ లీకేనని అధికారులు భావిస్తున్నారు.
Also read: Flights Cancel: యూకే ఆంక్షలు, వారం రోజులపాటు Air India సర్వీసులు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook