AP Budget 2025-26: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ రేపు ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు మరికొన్ని ప్రజలపై భారీ కానుకలు ఉంటాయని తెలుస్తోంది. సూపర్ సిక్స్ హామీలలతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ బడ్జెట్‌లో భారీగా పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రూ.3.25 లక్షల కోట్ల మేరఉంటుందని సమాచారం. అయితే ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు దక్కేలా ఉన్నాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Holiday: గుడ్‌న్యూస్.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు
ప్రాథమిక సమాచారం మేరకు ఏపీ బడ్జెట్‌పై కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. వ్యవసాయ బడ్జెట్ రూ.50 వేల కోట్లు దాటే అవకాశం ఉందని సమాచారం. ఇక బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉప ప్రణాళిక ప్రకటించడంతోపాటు అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు ఉండేందుకు ఆస్కారం ఉంది. పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టుగా ముందరవేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు చెల్లించడంతో దానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో మహా అపచారం.. 'అంధురాలైన అమ్మవారు'
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ కూటమి ప్రభుత్వం చేస్తుందని అంచనా. విద్య, వైద్యం, గృహ నిర్మాణమే లక్ష్యాలుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం శాసనసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలు వర్గాలపై హామీలు కురిపిస్తారని కూటమి నాయకులు భావిస్తున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతోపాటు నిరుద్యోగ భృతిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ సమావేశం..
బడ్జెట్ ప్రవేశానికి ముందు రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత గవర్నర్, స్పీకర్‌ను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. యథావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.