Rajamouli Friend: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సినిమాలతో తెలుగు సినిమా కు ప్రత్యేకమైన గుర్తింపును అందించారు. అంతేకాదు నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది అంటే ఇక రాజమౌళి ఇందుకోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అటు తన పని తాను చేసుకుంటూ పని రాక్షసుడిగా పేరు దక్కించుకున్న రాజమౌళి పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. జక్కన్న పై సంచలన ఆరోపణలు చేస్తూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఉప్పలపాటి శ్రీనివాసరావు అనబడే నేను 1990 నుండే రాజమౌళికి మంచి స్నేహితుడిని. అప్పటినుండి ఆయన కోసం నా జీవితాన్ని ధార పోశాను. ఆయన సక్సెస్ కావడం కోసం నా కెరియర్ మొత్తాన్ని కాదనుకున్నాను. మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాజమౌళి కోసమే నేను బ్యాచిలర్గా ఉండిపోయాను అంటూ పలు ఆరోపణలు చేశారు.
దాదాపు 34 సంవత్సరాల స్నేహం ఉందని చెప్పిన శ్రీనివాసరావు.. ఒకే కంచంలో ఒకే మంచంలో అన్నట్టు మా స్నేహం ఉండేదని చెప్పారు. రామాయణం , మహాభారతంలో ఒక ఆడదాని వల్ల ఎలా అయితే యుద్ధాలు వచ్చాయో.. ఈ 34 ఏళ్ల స్నేహంలో ఒక ఆడదాని వల్లే విభేదాలు వచ్చాయని తెలిపారు ఉప్పలపాటి శ్రీనివాస్ రావు.
ఇకపోతే యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తన వ్యవహరించారని తెలిపిన ఆయన.. సెల్ఫీ వీడియోతో పాటు లెటర్ ని కూడా రాజమౌళి సన్నిహితులకు పంపినట్లు తెలుస్తోంది . వీటి ఆధారంగానే ఇప్పుడు రాజమౌళి పై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.
వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు.
రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్.
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు.
సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025
ఇదీ చదవండి: Anjeer: అంజీర్ పండును 2 ఇలా వాడితే.. ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..
ఇదీ చదవండి: పాడవ్వకూడదని అల్లం వెల్లులి పేస్ట్ ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.