YSRCP Kidnap: వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ సంచలనం.. వీడియో విడుదల

YSRCP Leaks Sensation Video In Vallabhaneni Vamsi Case: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ కీలక వీడియోను బయటపెట్టింది. కిడ్నాప్‌నకు గురయితే ఆ యువకుడు ఇలా స్వేచ్ఛగా ఎలా తిరుగుతాడని ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2025, 10:13 PM IST
YSRCP Kidnap: వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ సంచలనం.. వీడియో విడుదల

Vallabhaneni Vamshi Case: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించిన వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ సంచలన వీడియో విడుదల చేసింది. కిడ్నాప్‌నకు గురయిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను లీక్‌ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడిపిస్తోందని ఆరోపిస్తున్న దానికి రుజువులు ఇవే అంటూ కొన్నాళ్లుగా వైఎస్సార్‌సీపీ కొన్ని ఆధారాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కిడ్నాప్‌నకు గురయిన యువకుడి వీడియో విడుదల చేసి కూటమి ప్రభుత్వానికి కౌంటర్‌ ఇచ్చింది.

Also Read: Tragedy In Srisailam: మహా శివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి.. నదిలో తండ్రీకొడుకులు జల సమాధి

వల్లభనేని వంశీ కిడ్నాప్‌ చేయించాడని ఆరోపణలు వస్తున్న కిడ్నాప్‌ సత్యవర్ధన్‌ స్వేచ్ఛగా సంచరిస్తున్న వీడియోను వైఎస్సార్‌సీపీ తన అధికారిక సోషల్‌ మీడియాలో బుధవారం రాత్రి విడుదల చేసింది. సత్యమేవ జయతే అంటూ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. 'తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది' అంటూ వైఎస్సార్‌సీపీ వ్యాఖ్యానించింది.

Also Read: Marry Or Will Be Fired: బ్రహ్మచారులకు కంపెనీ నోటీసు వైరల్‌.. 'పెళ్లి చేసుకోకుంటే జాబ్స్‌ తీసేస్తాం!'

'ఈ వీడియోలో బ్లూషర్ట్‌ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్‌. వల్లభనేని వంశీ కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులు చెబుతున్న వ్యక్తి ఇతడే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్‌ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?' అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12వ తేదీన విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్‌ చేసుకుంటున్న సత్యవర్థన్‌ వీడియో ఇది' అని వివరించింది. 'కిడ్నాప్‌చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు? ఇలా స్వేచ్ఛగా షాపింగ్‌ ఎలా చేస్తారు?' అంటూ ప్రశ్నలు సంధించింది. దీనర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడిందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అసలు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ అయ్యాడా? లేదా? అనేది ఇంకా తేలలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News