Samantha: నాగ చైతన్య నుంచి సమంత ఎంత భరణం తీసుకుందంటే..?

Samantha Divorce : నాగచైతన్య, సమంత పెళ్లి ఎంతగా వార్తల్లో నిలిచిందో.. వారి విరాకులు కూడా అంటగానే వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత సమంత భరణం తీసుకుంది అంటే ఎన్నో వార్తలు వచ్చాయి. ఏకంగా వందల కోట్లు ఈ హీరోయిన్ అక్కినేని ఫ్యామిలీ నుంచి తీసుకుంది అంటూ రూమర్స్ వచ్చాయి..

1 /5

నాగ చైతన్య, సమంత విడాకులు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్నేళ్లకే విడిపోయారు. వారి విడాకులపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా సమంత భరణంగా ఎంత తీసుకుందన్న విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి.  

2 /5

విడాకుల సమయంలో నాగ చైతన్య కుటుంబం సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సమంత ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిందట. తాను ఎవరి సహాయంతో ఎదగలేదని, తన జీవితాన్ని స్వయంగా ముందుకు తీసుకెళ్లగలనని ఆమె చెప్పినట్లు సమాచారం. ఈ విషయం కరెంట్ జోహార్ షోలో కూడా సమంత చెప్పుకొచ్చింది.

3 /5

నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత…ఈమధ్యనే ఈ హీరో.. శోభిత ధూళిపాళని వివాహం చేసుకున్నారు. ఇక ఈ విషయం గురించి ఏదైనా ఇంటర్వ్యూలో సమంత స్పందిస్తుందేమో అని ఎంతో మంది ఎదురు చూశాడు. అయితే దీనిపై సమంత ఎటువంటి స్పందన ఇవ్వలేదు. 

4 /5

ఇక నాగచైతన్య వివాహం దగ్గర నుంచి సమంతా అభిమా.. తమదైన విధంగా స్పందిస్తున్నారు. కొందరు నాగ చైతన్యను తప్పుపడితే, మరికొందరు సమంత నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. సమంతకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

5 /5

ఇక అన్నిటికన్నా మించి భరణం ఏమి తీసుకోకుండా సమంత తన జీవితం తాను చూసుకుంటూ బతుకుతూ ఉండటంతో.. సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఆమెని అభినందిస్తున్నారు.