Unmarried Employees: మానవ జీవితంలో పెళ్లి అనేది ఒకసారి చేసుకునేది. అయితే వివాహా వ్యవస్థలో మార్పులు చేసుకుంటున్న కారణంగా పరిస్థితులు చక్కదిద్దేందుకు కంపెనీ కొత్త నిబంధనలు రూపొందించింది. వివాహ వ్యవస్థను పునరుద్ధరణ కోసం కంపెనీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కంపెనీలో చేరిన వారు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. దీంతో కంపెనీ ఉద్యోగులు పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే నిబంధన విధించింది. ఈ వ్యవహారం చైనాలో వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ అధికారులు హెచ్చరించినా కూడా ఆ కంపెనీ తన విధానాలను సమర్ధించుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు
చైనాలో షాన్‌డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూపు కో లిమిటెడ్ అనే ఓ కంపెనీ ఉంది. కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇటీవల ఓ హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్‌లోపు అందరూ పెళ్లి చేసుకోవాలని ఉండాలని స్పష్టం చేసింది. అలా నోటీసులు అందుకున్న ఉద్యోగులు 1,200 మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఇది చూసి విస్తుపోయారు. పెళ్లి కాని బ్యాచిలర్స్‌తోపాటు పెళ్లయి విడాకులు తీసుకున్నవారికి.. ఒంటరిగా ఉంటున్న స్త్రీ, పురుషులకు కంపెనీ స్పష్టంగా తెలిపింది. గడువు ముగిసేలోపు పెళ్లి చేసుకోని వారు ఉంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ విధానపరమైన విధానం కార్పొరేట్ రంగంలో చర్చకు దారి తీసింది.
Also Read: Neera Cafe: హైదరాబాద్ ప్రజలకు భారీ షాక్.. నీరా దుకాణం బంద్?
ఈ వ్యవహారం ప్రభుత్వ అధికారుల వరకు వెళ్లడంతో వారు కంపెనీ వివరణ కోరారు. అయితే షాన్‌డాంగ్ షుంటియన్ కంపెనీ మాత్రం తన విధానాన్ని సమర్ధించుకున్నది. ఈ సందర్భంగా అధికారులకు ప్రత్యుత్తరం రాస్తూ కీలక విషయాన్ని వెల్లడించింది. 'చైనాలో వివాహ రేటు భారీగా తగ్గుతోంది. వివాహల రేటును పెంచాలనే ప్రభుత్వ విధాన నిర్ణయానికి మద్దతుగా కంపెనీలో ఈ నిబంధన తీసుకువచ్చాం' అని షాన్‌డాంగ్ కంపెనీ వివరించింది. అయితే చైనాలో ఉన్న నిబంధనల ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న నిర్ణయం. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook