Central Govt Pension Scheme: కేంద్ర ప్రభుత్వం సరికొత్త పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌కు మించి ప్రజల కోసం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ స్కీమ్‌పై ఇప్పటికే కార్మిక మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది. వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేలా ప్లాన్ చేసుకునేందుకు ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. కొత్త పింఛన్ పథకాన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలవనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే మన దేశంలోనూ ఈ స్కీమ్‌ను తీసుకురానున్నారు.
ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 18 ఏళ్లు నిండిన పౌరులు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌కు విరాళం ఇవ్వొచ్చు. ఈ పథకాన్ని EPFO పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ విధివిధానాలను రూపొందిస్తోంది. అంతా పూర్తయిన తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా.. ఉపయోగకరంగా మార్చడానికి ప్రజలు, నిపుణులు, వివిధ మంత్రిత్వ శాఖలతో కార్మిక శాఖ చర్చలు జరుపుతోంది.
కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపారవేత్తలు వంటి అసంఘటిత రంగానికి చెందిన ప్రజలు కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌లో ఇతర పెన్షన్ స్కీమ్స్‌ను విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న వాలంటరీ పెన్షన్ స్కీమ్స్ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM), జాతీయ పెన్షన్ పథకాలను కొత్త పెన్షన్ స్కీమ్‌లో చేర్చే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా తెలియరాలేదు.
PM-SYM, జాతీయ పెన్షన్ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్స్‌లో ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు జమ చేసుకోవచ్చు. మనం ఎంత జమ చేస్తే.. ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది. ఈ స్కీమ్స్తోపాటు అటల్ పెన్షన్ స్కీమ్, ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్‌ను కూడా చేర్చవచ్చని అంటున్నారు. 2050 నాటికి వృద్ధుల సంఖ్య దేశ జనాభాలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్, చైనా, కెనడా, రష్యా వంటి దేశాల తరహాలో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయనుంది.
Also Read: Hero Spender EV: హీరో స్పెండర్ ఎలక్ట్రిక్ బైక్ 2025 వచ్చేస్తోంది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇవే!
Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.