Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ నియమించాలనే డిమాండ్ రోజురోజుకూ అధికమౌతోంది. ఈ ప్రచారం వెనుక చంద్రబాబు హస్తముందో లేదో తెలియదు గానీ ఇప్పుడు ఆ పార్టీలోనే విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ను పూర్తిగా వ్యతిరేకించి ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలనం రేపారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అంశానికి ఇప్పట్లో తెరపడేలా కన్పించడం లేదు. ఈ వాదన కూటమి పార్టీలో చిచ్చురేపేలా కన్పిస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో డిమాండ్ చేసినా ఆయన ఖండించక పోవడంతో దీని వెనుక ఆయన హస్తముందనే వాదన బలపడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముకుతాడు వేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన తెర పైకి వచ్చిందని తెలుస్తోంది. దాదాపు టీడీపీ నేతలంతా నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నారా లోకేష్ కూడా ఖండించకపోగా, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు హస్తముందంటూ జరుగుతున్న ప్రచారానికి కాస్త బలం చేకూరినట్టయింది.ఇక ఆ తరువాత టీడీపీ నేతలు మరింతగా డిమాండ్ చేయడం ప్రారంభించారు.
గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
మరోవైపు తమ అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్నామంటూ జనసేన నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి కోరడం సరైందని కాదని చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు లోకేష్‌కు ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ప్రతిపాదించిన సంగతి గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన నారా లోకేష్‌కు తగిన పదవి ఇప్పటికే లభించిందన్నారు. అంటే పరోక్షంగా మరో పదవి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ఉన్నంతవరకూ ఆయనే సీఎం అంటూ ముక్తాయింపు ఇచ్చారు.
Also read: Chandrababu U Turn: సూపర్ సిక్స్‌పై చంద్రబాబు యూ టర్న్, జగన్ చేతికి అస్త్రం లభించేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి