Allu Arjun: రేవంత్‌కు అల్లు అర్జున్ ఝులక్..?.. హైకోర్టులో కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్..?.. కాక రేపుతున్న లాయర్ అశోక్ రెడ్డి మాటలు.. వీడియో ఇదిగో..

Allu Arjun Vs Revanth Reddy: అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీని ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచినట్లు వ్యాఖ్యలు చేశారు. దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 14, 2024, 10:39 AM IST
  • అల్లు అర్జున్ ను కావాలని జైల్లో పెట్టారని వాదన..
  • కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేస్తామన్న బన్నీ లీగల్ టీమ్..
Allu Arjun: రేవంత్‌కు అల్లు అర్జున్ ఝులక్..?.. హైకోర్టులో కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్..?.. కాక రేపుతున్న లాయర్ అశోక్ రెడ్డి మాటలు.. వీడియో ఇదిగో..

Allu arjun pushpa 2 movie stampede incident: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  అరెస్ట్ తో నిన్న ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. దేశంలో హీట్ వాతావరణం నెలకొంది. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. అల్లు అర్జున్ ను  తమతో విచారణకు తీసుకెళ్లినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని విషయం తెలియగానే.. పుష్ప2 ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ కు వస్తానని వాగ్వాదం చేసినట్లు తెలుస్తొంది.

మెగా ఫ్యామిలీ సైతం.. తమ మేనల్లుడి విషయం తెలిసి.. ఘటనపై ఆరాతీశారంట.. పలువురు డైరెక్టర్ లు చిక్కడ పల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ను క్యాన్షిల్ చేసుకుని మరీ.. చిక్కడ పల్లి వచ్చేందుకు రెడీ అయ్యారంట. కానీ.. పోలీసులు ట్రాఫిక్ సమస్యలు.. అభిమానులతో సమస్యలు ఏర్పడతాయని చెప్పడంతో ఆయన రాలేదంట. అదే విధంగా బన్నీ లీగల్ టీమ్ అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను కోర్టులో హజరు పర్చగా ఆయనకు రిమాండ్ విధించారు. మరోవైపు బన్నీ లీగల్ టీమ్ హైకొర్టులో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు.

 

దీనిపై మధ్యాహ్నం కోర్టు విచారించింది. అప్పటికే బన్నీని.. చంచల్ గూడ్ కు తరలించినట్లు తెలుస్తొంది. అయితే..ఈ కేసులో నిముష నిముషానికి మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు. దీనిపై హైకోర్టులో బన్నీ తరపున సీనియర్ లాయర్.. అశోక్ రెడ్డి గట్టిగా వాదించినట్లు తెలుస్తొంది. లాయర్ వాదనలతో  ఏకీభవించిన ధర్మాసనం.. సాయంత్రం తర్వాత బెయిల్ మంజురు చేసినట్లు తెలుస్తొంది. ఈ  క్రమంలో బన్నీ తరపు లాయర్ లు మాత్రం లీగల్ ఫార్మాలీటీస్ ను తొందరగా అయ్యేలా చూశారంట.. కానీ అక్కడ మాత్రం ఏదో జాప్యం జరిగినట్లు తెలుస్తొంది.

 కోర్టు వారి ఆర్డర్ కాపీలు.. హైకోర్టు అఫిషియల్ సైట్ లో అప్ లోడ్ అయితేనే.. జైలు సిబ్బంది బన్నిని విడుదల చేస్తారంట. కానీ పోలీసులు మాత్రం దీనిలో ఏదో జాప్యం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రాత్రి మాత్రం పోలీసులు..ఫార్మాలిటీస్ ప్రకారం.. అల్లుఅర్జున్ కు నంబర్ అలాట్ చేసి..జైలులో ప్రత్యేకంగా బారక్ లో ఉంచారంట. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం తెల్లవారు జామున ఆర్డర్ కాపీలు అందడంతో పోలీసులు అల్లుఅర్జున్ ను విడుదల చేసినట్లు తెలుస్తొంది.

అంటే బన్నీ దాదాపు.. బన్నీ నిన్న సాయంత్రం 6.30 నుంచి..ఈరోజు ఉదయం..6.39 నిముషాల వరకు జైలులోనే ఉన్నారంట. అయితే.. బన్నీని పోలీసులు ప్రత్యేకమైన ఎస్కార్ట్ లో తన ఇంటికి తరలించినట్లు తెలుస్తొంది. అదే విధంగా..అల్లు అర్జున్ విడుదలయ్యాక.. ఆయన తరపు లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. బన్నీని విడుదల చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆయన ఆరోపించారు.

Read more: Allu Arjun: ఇంటికి కాకుండా ముందుగా గీతా ఆర్ట్స్‌కు చేరుకున్న అల్లు అర్జున్‌.. ఎందుకో తెలుసా?

కోర్టు వారి ఆదేశాల మేరకు.. బెయిల్ అందగానే.. ఆలస్యం చేయకుండా సదరు అక్యుస్ ను విడుదల చేయాలి. కానీ పోలీసుల ఆలస్యం వల్ల.. తన క్లైంట్.. అన్యాయంగా  జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. దీనిపై లీగల్ గా ముందుకు వెళ్తమాని.. కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని లాయర్ అశోక్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News