Allu Arjun At Geeta Arts: నేడు ఉదయం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా ఇంటికి కాకుండా గీతా ఆర్ట్స్‌కు వెళ్లారు. ఆయనతోపాటు అక్కడకు అల్లు అరవింద్, బన్నీ మామ కూడా ఉన్నారు. ముందుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్‌కు ముందుగా ఎందుకు చేరుకున్నారో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6:30 నిమిషాల సమయంలో విడుదలయ్యారు. ఆయన పుష్ప2 సినిమా ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో బన్నీని అరెస్ట్ చేశారు.
అయితే, జైలు నుంచి విడుదలైన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్‌కు బయలు దేరారు. నిన్న బన్నీ అరెస్ట్ అయిన తర్వాత స్నేహ పుట్టింటికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ వరకు ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన్ను చేర్చారు. అయితే, కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా బన్నీ విడుదలలో జాప్యం జరిగిందని దీనిపై న్యాయపోరాటం చేస్తామని బన్నీ తరఫు లాయర్ చెప్పారు.
గీతా ఆర్ట్స్ వద్ద అల్లు అర్జున్ మామ, అల్లు అరవింద్ కూడా తన వెంటే ఉన్నారు. అయితే ఇతర ప్రముఖులు కూడా వచ్చి ఆయన్ను కలిసే అవకాశం ఉంది.
ఇప్పటికే రానా వంటి ప్రముఖులు కూడా గీతా ఆర్ట్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ను కలిసే అవకాశం ఉంది. కాబట్టి గీతా ఆర్ట్స్ అయితే, విశాలంగా ఉంటుంది. అది అనువు అని అక్కడ ఉన్నారు బన్నీ.
మరోవైపు బెయిల్ కాపీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అందుకు జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆన్లైన్ కాపీతోపాటు మరో ఫిజికల్ కాపీ కూడా సబ్మిట్ చేసే వరకు ఆలస్యమైంది.
రాత్రంతా అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉన్నారు. వీఐపీ కేటగిరీ ప్రోటోకల్ ప్రకారమే ఇచ్చారట. అయితే, ఆయన సాధారణ ఖైదీలా మాత్రమే ఉండటానికి మొగ్గు చూపారు.అయితే, ఈ మధ్యంతర బెయిల్ కేవలం నాలుగు వారాలు మాత్రమే వర్తిస్తుంది.