Allu Arjun: చిరంజీవి పేరు కూడా ఎత్తని అల్లు అర్జున్.. కానీ ఆయనే ముందుగా..!

Allu Arjun - Chiranjeevi: స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారుగా 12 వేలకు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 13, 2024, 04:34 PM IST
Allu Arjun: చిరంజీవి పేరు కూడా ఎత్తని అల్లు అర్జున్.. కానీ ఆయనే ముందుగా..!

Chiranjeevi:తెలుగు చిత్ర పరిశ్రమలో  తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.  తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేసి భారీ సక్సెస్ ను అందుకున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది.  అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది .అటు అల్లు అర్జున్ కి కూడా మంచి పేరు లభించింది. 

ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అయితే నాలుగవ తేదీన బెనిఫిట్ షోలో వేశారు. హైదరాబాదులోనే సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన మహిళ అక్కడికక్కడే మరణించడంతో ఆమె భర్త అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. 

అందులో భాగంగానే అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం జరిగింది . దీంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా మొదటిసారి స్పందించడం పై మెగాస్టార్ మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు 

వాస్తవానికి పుష్ప 2  సినిమా ప్రమోషన్స్ లో బన్నీ ఎక్కడా కూడా తన మామయ్యల పేరు ఉచ్చరించలేదు. ముఖ్యంగా తాను ఈ స్థాయికి రావడానికి కారణం చిరంజీవి.  ఆ విషయాన్ని మర్చిపోయి తాను సొంత కష్టం పైన ఈ స్టేజ్ కి వచ్చాను అంటూ ప్రగల్బాలు పలికారు. ఆఖరికి నాగబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇకనైనా అసలు నిజం  తెలుసుకొని వెనక్కి రా.. లేకపోతే ఎప్పటికీ మాలో కలవలేవు ఉంటూ ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినా  దీనిపై అల్లు అర్జున్ స్పందించలేదు. 

అయితే అల్లు అర్జున్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కోపం తెచ్చుకోవాలి. కానీ ఆయన మాత్రం ఏ మాత్రం అలాంటివి చూపించకుండా తన అల్లుడు అరెస్టు అయ్యాడు అని తెలియగానే వెంటనే వారి ఇంటికి చేరుకోవడంతో ఇది చిరంజీవి గొప్పతనం అంటూ అల్లు అర్జున్ పై కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా చిరంజీవి మంచితనం మరొకసారి బయటపడిందని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇప్పటికైనా అల్లు అర్జున్ మారాలని కుటుంబంతో కలిసి పోవాలని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News