హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి యూరప్‌లోని పెద్ద పెద్ద నగరాలు ఇప్పటికే మూసివేయబడ్డాయి. కాగా ఇప్పటివరకు ఇటలీలో కోవిడ్-19 కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,809 కు చేరుకుందని, కాగా 368 మంది మరణించారని తెలిపారు. ఇరాన్ లో మొత్తం 724 పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇప్పటివరకు 100 మరణాలు సంభవించాయని నివేదికలో పేర్కొంది.
Read Also: కరోనావైరస్ ఆందోళనల మధ్య బ్యాంకులకు ఆర్బీఐ సూచన
భారతదేశంలో 114 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసింది. దేశంలో కోవిడ్ -19పై బెదిరింపులను అరికట్టాలని, వదంతులు నమ్మవద్దని, దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని, అదేరకంగా అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
ఇది కూడా చదవండి: sensex: భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండే
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ.. భక్తులతో కిటకిటలాడే విఘ్నేశ్వర ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైట్‌క్లబ్‌లు, రాత్రి పూట వేడుకలు, జిమ్ లు ఇతర బహుళ సముదాయాలను మార్చి 31 వరకు మూసివేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. 50 పైగా ప్రభుత్వానికి సంబంధించి అన్నీ సమావేశాలను రద్దు చేసుకున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ దౌర్భాగ్య స్థితికి ఆ పార్టీయే ప్రధాన కారణం..
కరోనావైరస్ వ్యాప్తిని అదుపు చేసే ప్రయత్నంలో బాగంగా నాగాలాండ్ ప్రభుత్వం సోమవారం నాడు దేశీయ, విదేశీ పర్యాటకుల సందర్శనను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. మార్చి 31 వరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకలేశ్వర్ ఆలయంలో జరిగే 'భాస్మార్తి' కార్యక్రమాన్నిరద్దు చేయనున్నట్టు తెలిపారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..