Post Office Insurance: పోస్టాఫీసుల్లో సేవింగ్, ఎఫ్‌డి, ఆర్‌డి పధకాలే కాకుండా ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ లేదా సేవింగ్ ప్లాన్స్ ఎంత అవసరమో ఓ మనిషికి ఇన్సూరెన్స్ కూడా అంతే అవసరం. దురదృష్టవశాత్తూ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆర్ధికంగా చేయూత లభిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో బీమా పధకాలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే పోస్టాఫీసు అద్భుతమైన, అతి తక్కువ ప్రీమియంతో బీమా ప్లాన్ ప్రకటించింది.
రోజుకు కేవలం 1.50 రూపాయలు చెల్లించి 10 లక్షల బీమా పొందే అద్భుతమైన, అత్యంత చౌక ప్లాన్ ఇది. ఇదొక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఏడాదికి 520 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు నామినీకు అందుతాయి. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం కలిగినా 10 లక్షల బీమా లభిస్తుంది. ప్రమాదంలో ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చులకు 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇక పాలసీదారుడు మరణిస్తే 21 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు చదువు నిమిత్తం మరో లక్ష రూపాయలు చెల్లిస్తారు. టాటా ఏఐజీ, నివా భూపా, స్టార్ హెల్త్ కంపెనీల భాగస్వామ్యంతో పోస్టాఫీసు కొన్ని ప్రమాద బీమాలను అందిస్తోంది.
ఇక మరో ప్రమాద బీమా పధకం ప్రైవేట్ కంపెనీ నివా భూపా సహకారంతో అందిస్తోంది. ఇందులో ఏడాదికి 755 రూపాయలు చెల్లించాలి. ప్రమాద బీమా అంటే ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే 15 లక్షలు రూపాయలు నామినీకి ఇస్తారు. ఇందులో కూడా శాశ్వత లేదా పాక్షిక వైకల్యం ఎదురైతే 15 లక్షలు ఇస్తారు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చులుంటే మరో లక్ష రూపాయలు అందిస్తారు.
ఈ ఇన్సూరెన్స్ పధకాలను దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచిైనా తీసుకోవచ్చు. పాలసీదారుడి వయస్సు 18 నుంచి 65 ఏళ్లు ఉండాలి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఎక్కౌంట్ అవసరం.
Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి