Cooking Oil Prices Hike: భారీగా పెరిగిన వంట నూనె ధరలు..ఎంత పెరిగాయంటే?

Cooking Oil Prices Hike:  మార్కెట్లో వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటాయి. లీటర్‌పై రూ.20 నుంచి 30 వరకు రేట్లు పెరిగాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 09:04 AM IST
  • ప్రజల నెత్తిన మరో ధరల పెంపు పిడుగు
  • భారీగా పెరిగిన వంట నూనె ధరలు
  • సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం
Cooking Oil Prices Hike: భారీగా పెరిగిన వంట నూనె ధరలు..ఎంత పెరిగాయంటే?

Cooking Oil Prices Hike: రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine war) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం భారత్ పై పడింది. దేశంలో వంటనూనెల ధరలు పెరిగాయి. ఎగుమతులపై ఆంక్షలు, సరఫరాలో ఆటంకాలు, యుద్ధం కారణంగా వంటనూనె ధరలు (Cooking oil prices) అమాంతం పెరిగాయి. గత నెలరోజుల వ్యవధఇలో లీటర్ పామాయిల్ ధర రూ. 20, సన్ ప్లవర్ అయిల్ ధర రూ.24, వేరుశెనగ అయిల్ రూ.23 వరకు పెరిగాయి. వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయిల్ ఫెడ్ పేర్కొంది. మన దేశంలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో 90శాతం వరకు విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అత్యధికంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లోని సమాచారం మేరకు.. శనివారం దేశవ్యాప్త సగటు ధరలు ఈ విధంగా ఉన్నాయి. సన్ ఫ్లవర్‌ ఆయిల్ రూ.152.30, పామాయిల్ నూనె రూ.135.78, వేరుసెనగ ఆయిల్ రూ.173.40గా ఉంది. విజయవాడలో చిల్లర మార్కెట్లో పామాయిల్ లీటర్ ధర రూ.158, పొద్దు తిరుగుడు నూనె రూ.175, వేను సెనగ నూనె రూ.175గా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో...ట్రేడర్లు ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది. ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.  ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Amul hikes milk prices: పాల ధర పెంచేసిన అమూల్.. లీటర్ కు ఎంత పెంచారంటే.. ?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News