7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. మార్చ్ నెలలో పెరిగిన డీఏ ఎరియర్లతో సహా అందనుంది. దాంతో ఉద్యోగులకు మార్చ్ నెల జీతం కూడా పెరుగుతోంది. జీతభత్యాలు ఎంత పెరగనున్నాయో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఓ వైపు 8వ వేతన సంఘం గురించి చర్చ నడుస్తోంది. మరో వైపు జనవరి నెల డీఏ పెంపు ఎప్పుడు ఉంటుంది. ఎంత ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. డీఏ పెంపు త్వరలోనే ప్రకటించనుంది. జనవరి నెలలో పెంచాల్సిన డీఏ మార్చ్ నెలలో రెండు నెలల ఎరియర్లతో సహా అందనుంది. జూలై నుంచి డిసెంబర్ వరకూ అందిన ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం డీఏ ఎంతనేది నిర్ధయమౌతుంది. ఈసారి డీఏ 3 శాతం ఉండవచ్చని అంచనా ఉంది. గత ఏడాది జూలైలో డీఏ 3 శాతం పెరగడంతో 53 శాతానికి చేరుకుంది.
ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఈ ఏడాది జనవరి నెల డీఏ పెంపు ప్రకటన ఇంకా వెలువడలేదు. మార్చ్‌లో హోలీ పండుగ నాటికి డీఏ పెంపు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల ఎరియర్లతో కలిపి మార్చ్ నెల జీతంతో పెరిగిన డీఏ అందుతుంది. డీఏ పెంపు అనేది కనీస వేతనంపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం 53 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు జనవరి పెంపుతో 56 శాతం అవుతుంది. ప్రస్తుతం ఎవరైనా ఉద్యోగి నెలకు 15 వేలు డీఏ రూపంలో తీసుకుంటుంటే ఇక నుంచి 15,450 రూపాయలు అందుకుంటాడు. అంటే డీఏ పెరిగినప్పుడు కనీస వేతనం కూడా పెరుగుతుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదిలో రెండు సార్లు జనవరి, జూలైలో ఈ డీఏ పెంపు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి