మల్టీస్టారర్ ట్రెండ్ లో వెంకటేష్ మోస్ట్ సక్సెక్ ఫుల్ హీరోగా నిలిచారు. వెంకీతో మాల్టిస్టారర్ మూవీ అంటే సూపర్ హిట్ గ్యారెంటీ అనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో వెంకీతో కలిసి మల్టీస్టారర్ నటించేందుకు యువ హీరోలు క్యూ కడుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వెటరన్ హీరోవ వెంకటేశ్ కు అసలు ఎంత డిమాండ్ ఏర్పడిందో ఒక్కసారి పరిశీలిద్దాం....
దగ్గబాటి వెంకటేష్ నటించిన తొలి మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ హిట్ అవడంతో మల్టీస్టారర్ మూవీ విషయంలో వెంకీ పాజిటివ్ గా ఆలోచించడం మొదలెట్టారు. మల్టీస్టారర్స్ పెద్ద విషయమే కాదు.. కావాల్సింది కథలే అని చెప్పకనే చెప్పాడు వెంకటేష్. అప్పటి నుండి మల్టీ స్టారర్స్ విషయంలో ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఆటిట్యూడ్ తోనే ఉన్నాడు.
అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టి స్టార్ F2 మూవీ అంచాలకు మించి హిట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టకోవడమే కాకుండా వెంకటేశ్ కు సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ హిట్ అవుడంతో మల్టీ స్టారర్ మూవీస్ పై వెంకీ ఆలోచన మరింత పాజిటివ్ గా మారింది.
ఇప్పుడు తాజాగా తన అల్లుడు చైతుతో ‘వెంకీ మామ’ మూవీ కోసం వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారు . ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా చుట్టూ కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇలా పాజిటివ్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుడంతో వెంకీతో మల్టీస్టారర్స్ మూవీలో నటించేందుకు యంగ్ హీరోలు క్యూకడుతున్నట్లు టాలీవుడ్ వార్త హల్ చల్ చేస్తోంది…ఇంతకీ ఈసారి వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్స్ ఎవరన్నది ఇంకా బయటికి రాలేదు కానీ... వెంకీతో మల్టీస్టారర్స్ మూవీలో నటించేందుకు ఇద్దరు స్టార్స్ ఫిక్సనే టాక్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. రానా తో సినిమా ఉంటుందని తెలుస్తుంది టాక్ వినిపిస్తోంది. మరోవైపు రవితేజ వెంకీతో నటించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెంకీ మామా మాజాకా