Varun Tej as Abhinandan Varthaman: అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్.. పాన్ ఇండియా లెవల్లో మూవీ!

Varun Tej to Play Abhinandan Varthaman Role in Varun Tej 13: వరుణ్ తేజ్ తన 13వ సినిమాలో అభినందన్ భరద్వాజ్ పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 17, 2022, 09:15 PM IST
Varun Tej as Abhinandan Varthaman: అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్.. పాన్ ఇండియా లెవల్లో మూవీ!

Varun Tej to Play Abhinandan Varthaman Role in Varun Tej 13: మెగా హీరో అనే టాగ్ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా చాలా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్, పెదనాన్న చిరంజీవి ఆశీస్సులతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన దాదాపు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు.

తన మొట్టమొదటి సినిమా ముకుంద నుంచి మొన్న విడుదలైన గని సినిమా వరకు ప్రతి సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ 13వ సినిమాకి సంబంధించిన ఒక అధికారిక వీడియో విడుదలైంది. ఈ వీడియోలో తన 13వ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత వరుణ్ తేజ్ కాస్త గర్వంతో ఉప్పొంగినట్లు కనిపిస్తున్నాడు. తరువాత ఒక విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చూపించారు.

అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి గుర్తుండే ఉంటుంది. పాకిస్థాన్లోకి చొరబడిన మన యుద్ధ విమానాలు అక్కడ ఒక టెర్రరిస్ట్ క్యాంపులు సైతం ధ్వంసం చేశాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ టెర్రరిస్టులను కోల్పోవాల్సి వచ్చింది.

అయితే అనూహ్యంగా మన భారతదేశానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని అక్కడ వాళ్ళు కూల్చివేయడంతో అందులో పైలట్ గా ఉన్న అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బందీగా చిక్కారు. అయితే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఆయన్ని ఏమీ చేయకుండా పాకిస్తాన్ భారత్ కి అప్పగించింది. చాలా కాలం పాటు అభినందన్ వర్ధమాన్ గురించి చర్చ జరిగింది కానీ దాదాపు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అనే విషయం మీద మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.

అయితే ఆ అభినందన్ వర్ధమాన్ ఘటనను ఆధారంగా చేసుకుని వరుణ్ తేజ్ 13వ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక బడా ప్రొడక్షన్ సంస్థ పాన్ ఇండియా లెవెల్ లో దీనిని తెర కెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే కథతో వచ్చిన ఉరి అనే సినిమా గతంలో సూపర్ హిట్గా నిలిచింది. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కు ఆ సినిమా మొదటి హిట్గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లో కూడా ఈ సినిమా మొట్టమొదటి ప్యాన్ ఇండియా హిట్ గా నిలవబోతుందని వరుణ్ తేజ్ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Konidela Productions Trolled : లిరికల్ వీడియోనే రిలీజ్ చేయలేక పోయారు.. ఇక సినిమానేం రిలీజ్ చేస్తారు?

Also Read: Nagarjuna Shock: పేరుపేరునా కంటెస్టంట్లను కడిగిపారేసిన నాగార్జున.. ఎలిమినేషన్ షాక్ కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x