Allu Arjun Arrest: పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనమైంది. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్ధమౌతోంది. అల్లు అర్జున్ అభిమానులు సైతం ఇదే విమర్శ చేస్తున్నారు.
డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌ను సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో రేణుక అనే మహిళ మరణించగా ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. దాంతో చిక్కడ్ పల్లి పోలీసులు అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఒక్కసారిగా హఠాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ సమయంలో పోలీసులు కాస్త ఓవరాక్షన్ చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసులు నేరుగా ఇంటి బెడ్ రూమ్‌లోకి వచ్చేశారని, దుస్తులు మార్చుకునే సమయం అడిగినా నిరాకరించి అరెస్టు చేస్తున్నామని చెప్పారని అల్లు అర్జున్ మండిపడ్డారు. పోలీసులు తనను అదుపులో తీసుకోవడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని కానీ అప్పటికప్పుడు రావాలంటే ఎలాగని ప్రశ్నించారు.
పక్కా వ్యూహం ప్రకారం
వాస్తవానికి అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి పదిరోజులైంది. కానీ పక్కా ప్లానింగ్ ప్రకారం వేచి చూసి శనివారం, ఆదివారం కోర్టు సెలవులుండటం చూసి ఇవాళ శుక్రవారం అరెస్ట్ చేశారు. అంటే బెయిల్ దక్కకుండా చేసేందుకే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. కచ్చితంగా దీని వెనుక కుట్ర ఉందని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.
Also read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.