Kedar Selagamsetty Death: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో ఎదుగుతున్న యువ నిర్మాత కన్నుమూశాడు. సినీ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసుకు సాన్నిహిత్యం కలిగిన యువ నిర్మాత మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. అతడి మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతడి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read: Neera Cafe: హైదరాబాద్ ప్రజలకు భారీ షాక్.. నీరా దుకాణం బంద్?
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన నిర్మాత కేదార్ సెలగమ్‌శెట్టి అక్కడే హఠాన్మరణం పొందినట్లు తెలుస్తోంది. అత్యంత చిన్న వయసులోనే అతడు మృతి చెందడం విషాదంగా మారింది. ఓ నిర్మాత పెళ్లికి సినీ ప్రముఖులు హాజరవగా.. వారిలో కేదార్ కూడా ఉన్నారు. అతడి మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. కేదార్ మృతితో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్ కూడా విషాదంలో మునిగినట్లు తెలుస్తోంది.
Also Read: SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'గం గం గణేశా' సినిమాను కేదార్ సెలగమ్‌శెట్టి నిర్మించారు. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యంతో ఆనంద్ సినిమాను కేదార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే సినిమాను కూడా నిర్మించేందుకు కేదార్ అంగీకరించాడు. ఈ సందర్భంగా సుకుమార్‌కు ఇప్పటికే అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారని తెలుస్తోంది.
దుబాయ్‌లో మృతి చెందిన కేదార్ సెలగమ్‌శెట్టి సినీ కెరీర్‌తోపాటు పలు వివాదాలు ఉన్నాయి. గతంలో నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీలో కేదార్ దొరికారు. ఎప్పటి నుంచో అతడు డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం. డ్రగ్స్‌ను తీసుకోవడం ద్వారానే అనారోగ్యానికి గురయి మరణించినట్లు చర్చ జరుగుతోంది. అధికంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో అతడు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.