Flipkart New Facility: ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు మెరుగైన కస్టమర్ ఫ్రెండ్లీ విధానాలతో మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్ల కోసం మరో కొత్త సర్వీస్ ప్రారంభిస్తోంది. దేశంలోని కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఇవ్వనుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుందనే వివరాలు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ ఈ కొత్త విధానాన్ని ఈ నెలలోనే ప్రారంభించనుంది. తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, కోయంబత్తూర్, చెన్నై, భువనేశ్వర్, గౌహతి, ఇండోర్, జైపూర్, లక్నో, లూథియానా, నాగపూర్, పూణే, పాట్నా రాయ్‌పూర్, సిలిగురి, విజయవాడ నగరాల్లో ప్రారంభించనుంది. ఈ నగరాల్లో కొన్ని కేటగరీలకు చెందిన వస్తువులను ఆర్డర్ చేసిన రోజే డెలివరీ పొందవచ్చు. అయితే అదే రోజు డెలివరీ కావాలంటే మధ్యాహ్నం 1 గంటలోపు ఆర్డర్ బుకింగ్ జరగాలి.
ఆర్డర్ చేసిన రోజే డెలివరీ పొందే కేటగరీల్లో మొబైల్స్, ఫ్యాషన్, బ్యూటీ కేర్, లైఫ్‌స్టైల్, బుక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులున్నాయి. ఈ కేటగరీల్లో వస్తువులకు పైన చెప్పిన నగరాల్లో ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఉంటుంది. వన్ డే డెలివరీ ప్రక్రియ కోసం ఫ్లిప్‌కార్ట్ టెక్నాలజీ, మౌళిక సదుపాయాల్ని మెరుగుపరుస్తోంది. వీటిపై భారీగా పెట్టుబడి పెడుతోంది. ఇప్పటికే కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పూర్తి స్థాయి కేంద్రాల్ని నిర్మిస్తోంది. ఆర్డర్ చేసిన వస్తువుల పికప్ సమయం తగ్గించేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది.
సింగిల్ డే డెలివరీ విధానాన్ని ఫ్లిప్‌కార్ట్ తొలుత ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రారంభించనుంది. త్వరలో ఇతర నగరాలకు కూడా విస్తరించనుంది.
Also read: Leap Year 2024: లీప్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఎందుకు, లీప్ ఇయర్ చుట్టూ ఉన్న నమ్మకాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook