BJP TDP Janasena Alliance: ఏపీలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కతాటిపై చేరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన జట్టు కట్టగా.. తాజాగా బీజేపీతో పొత్తు దాదాపు ఖరారు అయింది. కేంద్రంలో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. మిత్రపక్ష పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో బీజేపీ అగ్ర నాయకులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు, ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. గురువారం రాత్రి దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిగాయి. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టేందుకు సుముఖంగా ఉన్నారు.
Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!
బీజేపీతో పొత్తు ఫైనల్ కాగా.. సీట్ల పంపకం పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల విషయం తేలిపోయింది. జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. కూటమిలోకి బీజేపీ చేరడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలిసింది. అంతకంటే ఎక్కువగా కేటాయిస్తే.. కూటమిపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులు ఫిక్స్ అయిపోగా.. సీట్ల పంపకంపై శుక్రవారం మరోసారి నేతలు సమావేశం కానున్నారు. సీట్ల లెక్కల కూడా తేలితే పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమిగా మద్దతుగా నిలిచింది. అప్పుడు బీజేపీకి 4 లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అయితే ఇప్పుడు బీజేపీ 7 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో బీజేపీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదంటున్నారు. బీజేపీ-జనసేనకు కలిపి 7 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. చర్చల్లో ఈ సంఖ్య కాస్త అటు ఇటు మారొచ్చని చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వరుసగా అసెంబ్లీ ఇంఛార్జ్‌లను ప్రకటిస్తూ ప్రచారం మొదలుపెట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయితే అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. ప్రచారం హోరెత్తనుంది.
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter