Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నాయకులతోపాటు ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వారి అరెస్ట్‌ల పర్వంలో నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా చేరిపోయారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని పోసాని కృష్ణ మురళీ ఇంటికి వచ్చిన ఏపీలోని రాయదుర్గం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అతడి అరెస్ట్‌తో మరోసారి తెరపైకి రెడ్ బుక్ ప్రస్తావనకు వచ్చింది. అతడిని అరెస్ట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి నిదర్శనం పోసాని కృష్ణ మురళీ అరెస్ట్ అని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు.
Also Read: YSRCP Kidnap: వల్లభనేని వంశీ కేసులో వైఎస్సార్‌సీపీ సంచలనం.. వీడియో విడుదల
రాయదుర్గంలోని మై హోం భుజ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పోసాని కృష్ణ మురళీ నివాసానికి ఏపీలోని రాయదుర్గం పోలీసులు ప్రవేశించారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా తాము ఏపీ పోలీసులమని చెప్పి.. విచారణకు సహకరించాలని పోసాని సతీమణికి నోటీసులు ఇచ్చారు. అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Tragedy In Srisailam: మహా శివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి.. నదిలో తండ్రీకొడుకులు జల సమాధి
అయితే ఎలా అరెస్ట్ చేస్తారు? అర్ధరాత్రి పూట ఎలా వస్తారు? అని పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. అయితే అరెస్ట్ సమయంలో పోసాని నిక్కర్, బనీయన్‌లో ఉన్నారు. వాగ్వాదం చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే అరెస్ట్ సమయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పండుగ పూట.. రాత్రి సమయంలో ఇంటిలోకి చొచ్చుకు వెళ్లి ఇలా అరెస్ట్ చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఖండిస్తున్నారు.
అరెస్ట్ సమయంలో వాగ్వాదం
తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో నటుడు పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్ట్ చేస్తున్నామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. కేసు ఉంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook